Advertisement

Breaking News: తోపులాటలో కింద పడిపోయిన రాహుల్ గాంధీ

By: Anji Thu, 01 Oct 2020 5:50 PM

Breaking News: తోపులాటలో కింద పడిపోయిన రాహుల్ గాంధీ

యూపీలోని హత్రాస్ జిల్లాకు కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీల లాంగ్ మార్చ్ ఉద్రిక్తతకుదారి తీస్తోంది. హత్రాస్ లో దారుణంగా హత్యాచారానికి గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వీరిని, పార్టీ కార్యకర్తలను గ్రేటర్ నోయిడా వద్ద పోలీసులు అడ్డుకోగా రాహుల్, ప్రియాంక తమ వాహనాలు దిగి కాలినడకన బయలుదేరారు.

అయితే మధ్యలో వీరిని పోలీసులు మళ్ళీ అడ్డుకున్న క్రమంలో తోపులాట జరిగింది. పోలీసులు రాహుల్ ను వెనక్కి నెట్టివేయడంతో ఆయన కింద పడిపోయారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను వెంటనే పైకి లేపారు. శాంతియుతంగా తాము వెళ్తుండగా ఖాకీలు ఘోరంగా ప్రవర్తించారని రాహుల్ దుయ్యబట్టారు.

అటు ప్రియాంక కూడా తనపట్ల పోలీసులు ఇలాగే ప్రవర్తించారని ఆరోపించారు. అయితే నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, అందువల్ల ఎవరినీ అనుమతించే ప్రసక్తి లేదని పోలీసులు అంటున్నారు.

Tags :

Advertisement