Advertisement

  • కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్.. కొహ్లీపై సంచలన వ్యాఖ్యలు....

కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్.. కొహ్లీపై సంచలన వ్యాఖ్యలు....

By: chandrasekar Mon, 16 Nov 2020 12:18 PM

కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్.. కొహ్లీపై సంచలన వ్యాఖ్యలు....


దీపావళి వేళ టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఇచ్చిన సందేశం చాలా మందికి నచ్చట్లేదు. ఈ క్రమంలోనే అతడిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వేనా..మాకు నీతులు చెప్పేదంటూ నిప్పులు కక్కుతున్నారు. తాజాగా ఈ లిస్టులో చేరిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్.. కొహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కొహ్లీని కుక్కతో పోల్చి కొత్త చర్చకు తెరలేపారు. కొహ్లీ.. అనుష్క శర్మ పెంపుడు కుక్క అని.. ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌పై దుమారం రేగుతోంది. ''అనుష్క తన పెంపుడు కుక్క విరాట్ కోహ్లీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు. కుక్క కంటే విశ్వాసమైన జీవి మరొకటి లేదు. కాలుష్యం వల్ల మానవళికి కలిగే ముప్పును కోహ్లీ ఇప్పటికే ఈ దోపిడీ దొంగలు, మూర్ఖులకు చెప్పాడు. ఓ సారి మీ డీఎన్ఏ చెక్ చేయించుకోండి. మీరిక్కడి వాళ్లేనా కాదో తెలుస్తుంది.'అని ట్వీట్ చేశారు ఉదిత్ రాజ్.

కొహ్లీ అభిమానులు ఆ ట్వీట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల వ్యక్తిగా ట్వీట్ చేస్తే.. ఇలానా మాట్లాడేది అంటూ ధ్వజమెత్తారు. ఐతే తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశాడు ఉదిత్ రాజ్. ‘దీపావళి సందర్భంగా కోహ్లీ చేసిన సూచన ఆహ్వానించదగింది. కొంతమంది దుర్మార్గులు ట్విటర్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా చూసి చూడనట్లుగా వదిలేస్తోంది. విరాట్‌ కొహ్లీపై విమర్శించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు వారు మనుషులే కాదు. ఆ నీచులు కుక్క స్థాయిని తగ్గించారు. కానీ కుక్క కంటే విశ్వాసమైన జీవి ఈ భూమి మీదే లేదు' అని ఉదిత్ రాజ్ స్పష్టం చేశారు. కాగా, దీపావళి సందర్భంగా ఆస్ట్రేలియాలో ఉన్న కోహ్లి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. పర్యావరణ హితంగా దీపావళి జరుపుకోవాలని.. టపాసులు కాల్చవద్దని కోరాడు. అదే కోహ్లి కొంపముంచింది.

కొహ్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంట్లో అరడజను కార్లు.. ప్రయివేట్ జెట్ ఉన్న వ్యక్తి పర్యావరణం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. అతడికి చాలా మంది తోడయ్యారు. కోహ్లి, అనుష్క వాడుతున్న వాహనాల నుంచి కాలుష్యం రావడం లేదా..? ఏంటి అంటూ మరో నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఒక జెట్.. ఒక మూడు గంటల ట్రిప్ ద్వారా 6 టన్నుల కర్భన ఉద్గారాలను విడుదల చేస్తుందని.. కార్ల ద్వారా కాలుష్యం కావడం లేదా..? అని నిలదీశాడు. మరికొందరు పర్యావరణానికి పాటుపడుతున్న వారి ఫోటోలను, కోహ్లి ఫోటోలను కలిపి.. ఎవరు పర్యావరణాన్ని కాపాడుతున్నారు..? అంటూ పోల్స్ నిర్వహించారు. కాగా, విరాట్ కొహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లాడు. జనవరిలో అనుష్క శర్మకు బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉండడంతో.. మొదటి టెస్ట్ తర్వాత కొహ్లీ ఇండియాకు తిరిగి రానున్నాడు.

Tags :

Advertisement