Advertisement

  • కుంభమేళా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు

కుంభమేళా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు

By: Sankar Thu, 15 Oct 2020 9:01 PM

కుంభమేళా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు


ప్రతి 12 సంవత్సరరాలకు ఒకేసారి కుంభమేళా జరుగుతుంది. దేశంలోని 12 నదులకు సంబంధించి 12 కుంభమేళాలు జరుగుతుంటాయి. అలహాబాద్ వచ్చే ఏడాది పూర్ణ కుంభమేళా జరగబోతున్నది. 144 సంవత్సరాల తరువాత జరిగే ఈ కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం రూ.4200 కోట్లు ఖర్చు చేయబోతున్నది.

దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక మతం ఉండదని అలాంటప్పుడు మత ప్రచారం కోసం రూ. 4200 కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై హిందూనాయకులు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కోట్లాదిమంది ప్రజలు హాజరుకాబోయే కార్యక్రమానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అని అయన తెలిపారు. కుంభమేళా అన్నది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే సంబంధించినది కాదని, ప్రపంచంలోని కోట్లాది మంది భక్తులు ఈ కుంభమేళాకు హాజరు అవుతారని, వచ్చిన వారికోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని యూపీ మంత్రి బ్రిజేష్ పాథక్ పేర్కొన్నారు.

Tags :

Advertisement