Advertisement

  • కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దేశ రాజధానిని వదలి వేరే ప్రాంతానికి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దేశ రాజధానిని వదలి వేరే ప్రాంతానికి

By: chandrasekar Fri, 20 Nov 2020 7:50 PM

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దేశ రాజధానిని వదలి వేరే ప్రాంతానికి


ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దేశ రాజధానిని వదలి వేరే ప్రాంతానికి వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దేశ రాజధాని ఢిల్లీని వీడనున్నారు. కొంతకాలంగా ఆమె ఊపిరితిత్తుల సంబంధ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీని కాలుష్యం వెంటాడుతోంది. దీంతో స్థానికులు శ్వాసకోశ, గొంతు సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోనియా సైతం కొద్ది రోజుల పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారని పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి.

ఢిల్లీ లో కాలుష్యం అధికంగా ఉండడంతో గోవా లేకుంటే చెన్నైలో ఏ ప్రాంతానికైనా బయలుదేరి వెళ్లే అవకాశం ఉందని, ఆమె వెంట రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలో ఎవరో ఒకరు ఉంటారని పేర్కొన్నారు. ఆగస్ట్‌లో హాస్పిటల్‌లో డిశ్చార్జి అయిన నాటి నుంచి సోనియా మందులు వాడుతున్నారని, కాలుష్యం కారణంగా ఛాతి సంబంధ సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పాయి.

ఇక్కడ ఏర్పడ్డ వాయు కాలుష్యంతో సోనియా ఉబ్బసంతో బాధపడుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఆమెను ఢిల్లీని వీడి బయటకు వెళ్లాలని వైద్యులు సూచించారని తెలిపారు. పార్టీలో సంస్థాగత మార్పును కోరుతూ ఆమెకు లేఖ రాసిన వారిలో కొంత మందితో సహా పలువురు నేతలు బిహార్‌ ఎన్నికల ఓటమిపై ఆత్మపరిశీలన కోసం డిమాండ్‌ చేస్తున్న తరణంలో సోనియా ఢిల్లీని వీడి వెళ్తున్నారు.

Tags :
|

Advertisement