Advertisement

కాంగ్రెస్ నేత "రాహుల్ గాంధీ" మరోసారి విమర్శలు

By: chandrasekar Sat, 27 June 2020 10:54 AM

కాంగ్రెస్ నేత "రాహుల్ గాంధీ" మరోసారి విమర్శలు


గాల్వన్‌లోయలో భారత సైన్యంలోని 20 మంది సైనికులు అమరులు కావడంతో దేశమంతా అట్టుడికిపోతోంది. రాహుల్‌ గాంధీ శుక్రవారం ట్విట్టర్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ప్రధాని భయపడకుండా నిజం చెప్పాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు.

రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ దేశం మొత్తం సైన్యం, ప్రభుత్వంతో ఐక్యంగా నిలుస్తుందన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం మన ప్రధాని స్పందిస్తు ఎవరూ భారతదేశానికి రాలేదని, మన భూమిని ఎవరూ ఆక్రమించలేదని అన్నారు. కానీ ఈ చిత్రంలో ఉపగ్రహం కనిపించినట్లు మాజీ ఆర్మీ జనరల్‌ చెబుతున్నారన్నారు.

చైనా మన భూమిని ఒకటి కాకుండా మూడు ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నట్లు లడఖ్‌ ప్రజలు చెబుతున్నారని, దీనికి ప్రధానిగా మీరు నిజం చెప్పాలన్నారు. భయపడాల్సిన అవసరం లేదని అమరువీరులైన మన సైనికులకు ఆయుధాలు లేకుండా సరిహద్దుకు ఎందుకు పంపారో తెలియజేయాలని ప్రశ్నించారు.

కరోనాపై యుద్ధంలో భాగంగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆపేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి కరోనాపై యుద్ధం చేస్తోన్న వీరులకు మద్దతు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. జనం చేత చప్పట్లు కొట్టిస్తేనో లేక ఆకాశంలోకి లైట్లేస్తేనో వైరస్ పోదని ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

భారత్ లో కోవిడ్ పరీక్షలు జరుగుతున్న తీరు సంతృప్తికరంగా లేదని కరోనా పరీక్షల్లో వేగం పెంచాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇండియాలో ప్రతీ 10 లక్షల జనాభాకు కేవలం 29 మందికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారన్న రాహుల్ విదేశాల్లో జరుగుతున్న కోవిడ్ పరీక్షలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అని రాహుల్ గాంధీ తెలిపారు.

Tags :
|
|

Advertisement