Advertisement

  • ఉచిత టీకాలు అంశంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం

ఉచిత టీకాలు అంశంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం

By: chandrasekar Thu, 03 Dec 2020 11:55 PM

ఉచిత టీకాలు అంశంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం


దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత టీకాలు అంశంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తపరిచారు. ప్రతి భారతీయుడికి టీకాలు వేసే అంశంపై బీజేపీ, కేంద్రం భిన్న వైఖరిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచిత టీకాలు వేస్తామని హామీ ఇచ్చిందని ఇప్పుడు గుర్తు చేశారు. ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్లాడుతూ కొవిడ్‌-19 వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికీ టీకాలు వేస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. దేశం మొత్తం వ్యాక్సిన్ వేయడంపై గురించి ప్రభుత్వం ఎప్పుడూ మాట్లాడలేదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను.

కానీ ప్రస్తుత వాస్తవిక సమాచారం ఆధారంగా మాత్రమే ఇటువంటి శాస్త్రీయ విషయాలను చర్చించి, దాన్ని విశ్లేషించడం చాలా ముఖ్యం అని రాజేశ్‌ భూషణ్‌ అన్నారు. అందుకుగాను ఈ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ కేంద్రంపై ట్విట్టర్‌లో ప్రధాని తీరును ప్రశ్నించారు. ప్రధాని ప్రతి ఒక్కరికి టీకా వేస్తామని చెప్పారని, కేంద్రం తాము ఎప్పుడూ చెప్పలేదని అంటుందన్నారు. ఈ రెండు వ్యాఖ్యల్లో ప్రధాని ఎటు వైపు స్టాండ్‌ తీసుకుంటారని ప్రశ్నించారు. దీన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ భిన్న వైఖరికి తాను ఆగ్రహం వ్యక్తపరచారు.

Tags :
|
|

Advertisement