Advertisement

  • రైతుల మొబైల్ ఫోన్ల‌లో ఉన్న జియో నెట్‌వ‌ర్క్‌ను మ‌రో నెట్‌వ‌ర్క్‌కు మార్చుకుంటామ‌ని ఆందోళన

రైతుల మొబైల్ ఫోన్ల‌లో ఉన్న జియో నెట్‌వ‌ర్క్‌ను మ‌రో నెట్‌వ‌ర్క్‌కు మార్చుకుంటామ‌ని ఆందోళన

By: chandrasekar Sat, 12 Dec 2020 11:33 AM

రైతుల మొబైల్ ఫోన్ల‌లో ఉన్న జియో నెట్‌వ‌ర్క్‌ను మ‌రో నెట్‌వ‌ర్క్‌కు మార్చుకుంటామ‌ని ఆందోళన


దేశంలో ఇప్పుడు రైతుల ఆందోళన రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తున్న విషయం తెలిసిందే. వీరు వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ రాజ‌ధానిలో కొన్ని రోజులు గా ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న రైతులు ఇప్పుడు వినూత్నంగా తమ నిర‌స‌నను తెలుపుతున్నారు. ఇందుకోసం వారు త‌మ మొబైల్ ఫోన్ల‌లో ఉన్న జియో నెట్‌వ‌ర్క్‌ను మ‌రో నెట్‌వ‌ర్క్‌కు మార్చుకుంటామ‌ని హ‌ర్యానా రైతు సంఘం నేత‌లు చెబుతున్నారు. రైతులు ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన చట్ట సవరణలను అంగీకరించక వాటిని రద్దు చేయాలని కోరుతున్నారు. కానీ ఈ చట్టాలను ర‌ద్దు చేయ‌డ‌మే కాకుండా తాము చెప్పిన 26 పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల్సిందే అని ఇప్పుడు స్ప‌ష్టం చేశారు. దీనికోసం ఆందోళనను తీవ్రతరం చేయనున్నట్లు చెపుతున్నారు. భార‌తీయ కిసాన్ యూనియ‌న్ ఆందోళ‌న‌ల‌ను మ‌రింత తీవ్రం చేయాల‌ని పిలుపునిచ్చింది. చ‌ట్టాల‌కు స‌వ‌ర‌ణ‌ల‌ను చేస్తామ‌న్న ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ల‌ను రైతు సంఘాల నేత‌లు అందరు కలసి తిరస్క‌రించారు.

ఇప్పుడు తీసుకువచ్చిన ఈ కొత్త చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డంతోపాటు 26 పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించే కొత్త చ‌ట్టాన్ని తీసుకురావాలని హ‌ర్యానా భార‌తీయ కిసాన్ యూనియ‌న్ అధ్య‌క్షుడు గుర్నామ్ సింగ్ చారుణి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగా ముందుగా రైతులంతా త‌మ మొబైల్ నెట్‌వ‌ర్క్‌ను జియో నుంచి మ‌రో దానికి మార్చుకొంటామని ఆ త‌ర్వాత డిసెంబర్ 12న హైవేలపై టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర పోరాటం జరిపి అంద‌రూ ఉచితంగా వెళ్లిపోయేలా చేస్తాంమని తెలిపారు. అదేవిధంగా డిసెంబ‌ర్ 14న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తామ‌ని గుర్నామ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు పంజాబ్‌, హ‌ర్యానాల నుంచి పెద్ద సంఖ్య‌లో రైతులు ఆందోళ‌న‌ల్లో పాల్గొన‌డానికి వ‌స్తుండ‌టంతో రానున్న రోజుల్లో ఢిల్లీలో నిర‌స‌న‌లు మ‌రింత తీవ్ర‌ రూపం దాల్చే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో వేచి చూడాల్సిందే.

Tags :
|

Advertisement