Advertisement

  • మూడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న రైతుల ఆందోళన...

మూడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న రైతుల ఆందోళన...

By: chandrasekar Tue, 15 Dec 2020 5:59 PM

మూడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న రైతుల ఆందోళన...


కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ఆందోళన వల్ల రోజుకు రూ.3,000 నుంచి 3,500 కోట్లు నష్టం వాటిల్లుతున్నదని అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా తెలిపింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నదని నివేదికలో పేర్కొంది.

రైతుల ఆందోళన మూడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం ప్రారంభించింది. దేశంలో దాదాపు ఏడాదిపాటు వ్యవసాయానికి దూరంగా రైతులు ఒక్కసారిగా వీధుల్లోకి రావడంతో పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తున్నదని ఆసోచాం పేర్కొంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేలా చూడాలని ఛాంబర్ సెక్రటరీ జనరల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రైతుల ఉద్యమం వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా పండ్లు, కూరగాయల ధరలు పెరిగిపోయాయని ప్రకటించింది. రైతుల ఆందోళనలను కొంతమంది స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆరోపించారు. ఇంకా ఆందోళనకి రైతులను రప్పించడానికి కొందరు నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలను అర్ధం చేసుకుని రైతులు తమ ఆందోళనలను విరమించుకోవాలని గడ్కరీ విజ్ఞప్తిచేశారు.

Tags :

Advertisement