Advertisement

  • బిగ్ బాస్-4ను నిలిపివేయాలంటూ మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు

బిగ్ బాస్-4ను నిలిపివేయాలంటూ మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు

By: chandrasekar Wed, 26 Aug 2020 09:07 AM

బిగ్ బాస్-4ను నిలిపివేయాలంటూ మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు


గడచిన బిగ్ బాస్ వరుస షోలు హిట్ అయ్యాయి. రానున్న సీసన్ 4 కు అంతరాయం కలిగించే విధంగా బిగ్ బాస్-4ను నిలిపి వేయాలంటూ హ్యూమన్ రిసోర్స్ కమిషన్ కు కొందరు పిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో ఆపాలంటూ మంగ‌ళ‌వారం కొందరు మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్-4ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ ముక్తల, తల్లిదండ్రుల సంఘం నేత గడ్డం మురళి, తెలంగాణ విద్యార్థి జేఏసీ నేత అమన్ గల్ రాజు మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు.

ఈ కార్యక్రమంపై పలు విమర్శలు వచ్చినప్పటికీ గత మూడు సీసన్ లు మంచి ఆధారణను సంపాదించుకున్నది. బిగ్ బాస్ షోపై గతంలోనూ అనేక సార్లు ఫిర్యాదులు వచ్చినా, బిగ్ బాస్ షోకు మాత్రం ఎలాంటి అడ్డంకి ఏర్పడలేదన్నారు. అయితే ఆగ‌స్ట్ 30న బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రసారం అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిలో పాల్గొనేది ఎవరని కూడా తెలియాల్సి వుంది.

Tags :

Advertisement