Advertisement

చంద్రబాబు పై హైకోర్టులో ఫిర్యాదు

By: chandrasekar Wed, 27 May 2020 11:05 AM

చంద్రబాబు పై హైకోర్టులో ఫిర్యాదు


రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబునాయుడు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.ర్యాలీలకు అనుమతి లేనప్పటికీ రోడ్డు పొడవునా ఆయనకు టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు లాక్‌డౌన్ ఉల్లంఘనపై ఎమ్మెల్సీ వి.గోపాల్ రెడ్డి హైకోర్టులో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు దాటిన తర్వాత టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గరికపాడు, నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం,గొల్లపూడి, విజయవాడ ప్రాంతంలో చంద్రబాబు ఆగారని తెలిపారు.

ఆయనకు స్వాగతం పలికేందుకు వందలాది మంది వచ్చారని.. చాలా మంది కనీసం మాస్క్ కూడా ధరించలేదని చెప్పారు. అసలు భౌతిక దూరమే పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్ననారు వి.గోపాల్ రెడ్డి. గతంలో సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, ప్రతిపక్ష నేత పదవిలో ఉన్నప్పటికీ ఏమాత్రం బాధ్యత లేకుండా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు.

complaint,in high court,against,chandrababu,andhra ,చంద్రబాబు, హైకోర్టులో ఫిర్యాదు,లాక్‌డౌన్,
ఉల్లంఘనపై, ఎమ్మెల్సీ


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో గుంటూరులోని ఉండవల్లిలో ఉన్న తన నివాసానికి వెళ్లారు. అంతకముందు మార్చి 22న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లారు.ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్కడే ఉండిపోయారు. ప్రన్తుతం లాక్‌డౌన్ 4లో ఆంక్షలను సడలించడంతో తిరిగి ఏపీకి వచ్చారు. ఐతే విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులను చంద్రబాబు పరామర్శించాలని భావించారు. అందుకోసం నేరుగా హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో వెళ్లాలనుకున్నారు. కానీ, విమానాలు రద్దు కావడంతో చంద్రబాబు విశాఖపట్టణం పర్యటన వాయిదాపడింది. దాంతో రోడ్డుమార్గంలోనే

Tags :

Advertisement