Advertisement

  • షిప్‌యార్డు క్రేన్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం

షిప్‌యార్డు క్రేన్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం

By: chandrasekar Mon, 03 Aug 2020 5:06 PM

షిప్‌యార్డు క్రేన్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ హిందూస్థాన్‌ యాజమాన్యం షిప్‌యార్డు క్రేన్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించడానికి అంగీకరించింది. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సైతం ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు యాజమాన్యంతో మంత్రి అవంతి శ్రీనివాస్‌, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

షిప్‌యార్డులో శనివారం భారీ క్రేన్‌ కుప్పకూలడంతో 11 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. క్రేన్‌ ప్రమాద ఘటనపై శాఖపరమైన విచారణ మొదలైందని, కారకులు ఎంతవారైనా వదిలిపెట్టబోమని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఆదివారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా జలంత్రకోట జాతీయ రహదారిపై ఘోరమైన మరో ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. షిప్‌యార్డు క్రేన్‌ ప్రమాదంలో మరణించిన భాస్కర్‌రావును చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో భాస్కరావు బావమరుదులు రాజశేఖర్‌, దిల్లీశ్వరరావు, నాగమణి పెద్దకోడలు మైథిలి తీవ్రంగా గాయపడ్డారు. భాస్కర్‌రావు అత్త నాగమణి, ఆమె చిన్న కోడలు లావణ్య, డ్రైవర్‌ రౌతు ద్వారక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Advertisement