Advertisement

  • కోహ్లీతో పోల్చితే నాకు నచ్చదు ..మా దేశ దిగ్గజాలతో పోల్చండి ..బాబర్ అజామ్‌

కోహ్లీతో పోల్చితే నాకు నచ్చదు ..మా దేశ దిగ్గజాలతో పోల్చండి ..బాబర్ అజామ్‌

By: Sankar Fri, 03 July 2020 2:06 PM

కోహ్లీతో పోల్చితే నాకు నచ్చదు ..మా దేశ దిగ్గజాలతో పోల్చండి ..బాబర్  అజామ్‌



గత కొంతకాలం క్రితంవరకూ ప్రపంచ క్రికెట్లో ఏ కొత్త కుర్రాడు వచ్చి రాణించిన సచిన్ తో పోల్చడం మనం చూస్తూనే ఉన్నాం ..అయితే సచిన్ వారసుడిగా మన్నలను అందుకొని సచిన్ స్థాయిని అందుకేందుకు దూసుకుపోతున్న ఆటగాడు విరాట్ కోహ్లీ ..అయితే ప్రస్తుత క్రికెట్లో బాగా రాణిస్తున్న ఆటగాళ్లను కోహ్లీ తో పోలుస్తున్నారు..ఆలా ఇటీవల కాలంలో పాకిస్తాన్ తరుపున అద్భుతంగా రాణిస్తున్న బాబర్ ఆజాం ను పాకిస్తాన్ కోహ్లీ అని అంటున్నారు .. అయితే తాను కోహ్లితో పోల్చడాన్ని పెద్దగా ఆస్వాదించనని అజామ్‌ తాజాగా తెలిపాడు.

పాకిస్తాన్‌ వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌ అయిన అజామ్‌.. విలేకరులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. దీనిలో భాగంగా తనను కోహ్లితో పోల్చడాన్ని ఎప్పుడూ గొప్పగా ఫీల్‌ కాలేదన్నాడు. కాగా, పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్లైన జావెద్‌ మియాందాద్‌, యూనిస్‌ ఖాన్‌, ఇంజమాముల్‌ హక్‌లతో పోలికనే ఎక్కువగా ఆస్వాదిస్తానన్నాడు. వారితో పోల్చితే తప్పకుండా చాలా గొప్పగా అనుకుంటానని అజామ్‌ అన్నాడు. ‘ నన్ను ఎవరితోనైనా పోల్చినప్పుడు అది పాకిస్తాన్‌ ప్లేయర్స్‌ అయితేనే దాన్ని ఆస్వాదిస్తా.

కోహ్లితో పోలిక కంటే పాక్‌ దిగ్గజాలతో పోల్చినప్పుడు గౌరవంగా భావిస్తా. మాకు మియాందాద్‌, యూనిస్‌ ఖాన్‌, ఇంజమాముల్‌ వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వారితో పోల్చండి.. అప్పుడు నాకు గొప్పగా అనిపిస్తుంది’ అని అజామ్‌ తెలిపాడు. టీ20ల్లో అజామ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకులో ఉండగా, వన్డేల్లో విరాట్‌ కోహ్లి టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అజామ్‌ను కోహ్లితో పోల్చడం ఎక్కువైంది. అయితే అది తనకు నచ్చదనే విషయాన్ని అజామ్‌ తన మాటల ద్వారా వెల్లడించాడు. కోహ్లి సాధించిన ఘనతలు పరంగా చూస్తే అజామ్‌ చాలా దూరంలోనే ఉన్నాడు., అయినప్పటికీ కోహ్లితో పోలిక వద్దని చెప్పడం, పాక్‌ దిగ్గజాలతో పోల్చాలని చెప్పడం గమనార్హం.

Tags :
|

Advertisement