Advertisement

  • రవాణా ఖర్చులు తగ్గి కమ్యూనికేషన్ ఖర్చులు పెరిగిన సంస్థలు

రవాణా ఖర్చులు తగ్గి కమ్యూనికేషన్ ఖర్చులు పెరిగిన సంస్థలు

By: chandrasekar Sat, 18 July 2020 5:13 PM

రవాణా ఖర్చులు తగ్గి కమ్యూనికేషన్ ఖర్చులు పెరిగిన  సంస్థలు


సంస్థల నిర్వహణలో కరోనా వైరస్ కారణంగా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఐటీ కంపెనీల ప్రయాణ ఖర్చుల తగ్గి కమ్యూనికేషన్ ఖర్చులు మాత్రం గణనీయంగా పెరిగాయి. కాల్స్, నెట్ కోసం కంపెనీలు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తున్నది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఇతర కంపెనీలు ప్రయాణ బిల్లులు తగ్గిపోయాయి. కానీ జూన్ త్రైమాసికానికి 86 శాతం రవాణా ఖర్చులు తగ్గాయంటే అర్థం చేసుకోవచ్చు. అయితే కమ్యూనికేషన్ బిల్స్ మాత్రం 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి.

గతేడాది జూన్‌లో మూడు కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ట్రావెలింగ్ కోసం రూ.2153 కోట్లను వెచ్చించింది. కానీ ఏడాది జూన్ త్రైమాసికంలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి.

కరోనా వైరస్ వల్ల వర్క్ ఫ్రం హోం చేయడం, జూమ్, ఇతర నెట్ వర్క్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా కంపెనీల ఎగ్జిక్యూటిట్స్ టీఏ భారీగా తగ్గింది. గతేడాది అది రూ.600 కోట్లుగా మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంపెనీకి ఖర్చయ్యేది. ఈ ఏడాది రూ.742 కోట్లు ఖర్చయ్యిందని రిలయన్స్ ప్రకటించింది.

కరోనా వైరస్ కన్నా ముందు కంపెనీలకు ట్రావెలింగ్ ఖర్చు ఉండేది. కంపెనీ ఖర్చులో మూడో స్థానంలో ప్రయాణ విభాగం ఉండేది. టెక్నికల్ సిబ్బంది, కన్సల్టెంట్ల కోసం కంపెనీలు నగదు వెచ్చించేవి. పట్టికలో మూడు కంపెనీలో ట్రావెలింగ్, కమ్యూనికేషన్ బిల్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రయాణ ఖర్చులు భారీగా తగ్గగా కమ్యునికేషన్ బిల్లు మాత్రం పెరిగాయి.

ఇన్ఫోసిస్ కంపెనీ ప్రయాణ ఖర్చులు 86 శాతం తగ్గాయి. రూ.827 కోట్ల నుంచి ఈ ఏడాది జూన్‌లో కేవలం 116 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ కమ్యూనికేషన్ కోసం మాత్రం రూ.127 కోట్ల నుంచి రూ.163 కోట్లను వెచ్చించాల్సి వచ్చింది. అంటే 28 శాతం వ్యయం పెరిగింది. ఇక టీసీఎస్ కూడా 69 శాతం ట్రావెలింగ్ వ్యయం తగ్గింది. కమ్యునికేషన్ కోసం 22 శాతం పెరుగగా విప్రో కంపెనీకి రవాణా కోసం 75 శాతం వ్యయం తగ్గగా కమ్యూనికేషన్ కు 26 శాతం పెరిగింది.

Tags :
|

Advertisement