Advertisement

  • తెలంగాణలో 27 జిల్లాల్లో కోరలుచాచస్తున్న కరోనా

తెలంగాణలో 27 జిల్లాల్లో కోరలుచాచస్తున్న కరోనా

By: Dimple Tue, 25 Aug 2020 08:51 AM

తెలంగాణలో 27 జిల్లాల్లో కోరలుచాచస్తున్న కరోనా

కరోనా సామాజిక వ్యాప్తి తో రాష్ట్రంలో ఎక్కడికక్కడ కేసులు పెరుగుతూ నే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో కంటైన్మెంట్‌ జోన్లు భారీగా పెరిగాయి. సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో 1,820 కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 281 కంటైన్మెంట్‌ జోన్లున్నాయి. ఇంకా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 187, జగిత్యాల జిల్లాలో 186, సిరిసిల్ల జిల్లాలో 182, గద్వాల జిల్లాలో 162, నిర్మల్‌ జిల్లాలో 132, మహబూబాబాద్‌ జిల్లాలో 118, మెదక్‌ జిల్లాలో 97 కంటైన్మెంట్‌ జోన్లున్నాయి.

హైదరాబాద్‌లో 65 సర్కిళ్లలో కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల్లో అనేక గ్రామాల్లోనూ జోన్లు ఏర్పాటయ్యాయి. కనీసం మూడుకు మించి కేసులు నమోదైన ప్రాంతాలను, వీధులను, అపార్ట్‌మెంట్లను, ఏరియాలను, గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లుగా చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 9,68,121 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. వాటిలో 1,06,091 మం ది వైరస్‌ బారిన పడినట్లు వెల్లడించింది. ఇక ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 82,411 మంది ఉండగా, మొత్తం 761 మం ది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 22,919 ఉండగా, వాటిల్లో 16,482 మంది ఇళ్లు లేదా వివిధ సంస్థల ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో 10 లక్షల జనాభాకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 26,076 అని బులెటిన్‌లో వెల్లడించారు. ఇక ఆదివారం ఒక్కరోజే 36,282 మందికి టెస్టులు చేయగా, అందులో 1,842 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. అలాగే తాజాగా ఆరుగురు కోవిడ్‌తో మృతి చెందారు.

ఒక్కరోజులో 1,825 మంది కోలుకున్నారు. ఇక తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 373 ఉండగా, నిజామాబాద్‌ జిల్లాలో 158, కరీంనగర్‌లో 134, సూర్యాపేటలో 113, రంగారెడ్డిలో 109, సిద్దిపేటలో 86, ఖమ్మంలో 77, వరంగల్‌ అర్బన్‌లో 74, జగిత్యాలలో 70, మహబూబాబాద్‌ జిల్లాలో 64 కేసులు బయటపడ్డాయి.

Tags :
|

Advertisement