Advertisement

  • తెలంగాణాలో కమర్షియల్‌ భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే

తెలంగాణాలో కమర్షియల్‌ భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే

By: chandrasekar Mon, 19 Oct 2020 10:30 AM

తెలంగాణాలో కమర్షియల్‌ భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే


తెలంగాణాలో కమర్షియల్‌ భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే జరగనున్నట్లు తెలిపారు. తెలంగాణాలో కేవలం వ్యవసాయ భూములు మాత్రమే తహసీల్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. వ్యవసాయేతర అనగా కమర్షియల్‌ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం ఎప్పటి లాగే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ జరుగుతాయి. వీఆర్వో వ్యవస్థ రద్దుతో సెప్టెంబర్‌ 8 నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్ట్రేషన్‌ ప్రక్రియ ఆగిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 16 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో జగదేవ్‌పూర్‌, దుబ్బాక, సిద్దిపేట, సిద్దిపేట రూరల్‌, చేర్యాల, హుస్నాబాద్‌, గజ్వేల్‌ పట్టణాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో జోగిపేట, నారాయణఖేడ్‌, సదాశివపేట, జహీరాబాద్‌, సంగారెడ్డిలలో కార్యాలయాలు ఉన్నాయి. మెదక్‌ జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి.

ఇక్కడ సాధారణంగా ఒక్కో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రోజువారీగా 350 నుంచి 450 వరకు రిజిస్ట్ట్రేషన్లు జరుగుతుంటాయి. 25 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తహసీల్‌ కార్యాలయాల్లో మొదలుకానున్నది. ఈ నేపథ్యంలో సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. వివరాలకు అధికారులను సంప్రదించాలని సూచించారు.

Tags :

Advertisement