Advertisement

  • నెటిజెన్లు తమకు తోచిన విధంగా బిర్యానీపై కామెంట్లు

నెటిజెన్లు తమకు తోచిన విధంగా బిర్యానీపై కామెంట్లు

By: chandrasekar Fri, 10 July 2020 6:20 PM

నెటిజెన్లు తమకు తోచిన విధంగా బిర్యానీపై కామెంట్లు


ఏ దేశానికి చెందిన వారైనా హైదరాబాద్‌ వచ్చారంటే తప్పనిసరిగా బిర్యానీ తిననిదే వెళ్లరంటే ఔచిత్యం కాదు. బిర్యానీ అనగానే హైదరాబాద్‌ చటుక్కున గుర్తుకువస్తుంది. అంతగా హైదరాబాద్‌ బిర్యానీకి పేరుంది. అందుకే పుణెకు చెందిన ఓ హోటల్‌ యాజమాన్యం తమ హోటల్‌ ముందు పెట్టిన బోర్డు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

అంతగా ఆ బోర్డులో ఏం రాశారంటే బిర్యానీ అంటే హైదరాబాద్‌దే! హైదరాబాద్‌లో కాకుండా మిగతా ప్రాంతాల్లో తయారయ్యేవన్నీ బిర్యానీలు కావు. కేవలం పులావ్‌లే ఇకపై బొంబాయి, పాకిస్తాన్‌లో తయారుచేసే బిర్యానీలను మటన్‌ మసాలా రైస్‌గానే పిలువాలి.

అదేవిధంగా ఆలుగడ్డలు కలిసి తయారుచేసే వాటిని బటాటా వడా రైస్‌గానే పేర్కొనాలి. అంతేగానీ బిర్యానీ అని మాత్రం పిలువొద్దు అని ఘాటుగా రాశారు. ఓ బిర్యానీ ప్రియుడు పుణె హోటల్‌ ముందు పెట్టిన బోర్డును సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజెన్లు తమకు తోచిన విధంగా బిర్యానీపై కామెంట్లు విసురుతున్నారు.

ఒకరేమో కోల్‌కతా పొటాటో బిర్యానీ మాటేంటి? అని ప్రశ్నిస్తుండగా మరొకరు కేరళకు చెందిన థలస్సేరి బిర్యానీ రుచి చూడండి ఒకసారి అని పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా నాలుగు వందలకు పైగా సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో బిర్యానీ రుచే వేరు.

Tags :
|

Advertisement