Advertisement

  • భార‌త్‌ మరియు చైనా మధ్య కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు ఈనెల 12న

భార‌త్‌ మరియు చైనా మధ్య కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు ఈనెల 12న

By: chandrasekar Mon, 05 Oct 2020 3:18 PM

భార‌త్‌ మరియు చైనా మధ్య కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు ఈనెల 12న


భార‌త్‌ మరియు చైనా మధ్య కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు ఈనెల 12న జరగనున్నాయి. ఇరుదేశాల వాస్తవాధీన రేఖ వెంబడి ఎక్కువ మొత్తంలో సైన్యాన్ని మోహరించిన విషయం తెలిసిందే. స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త్‌-చైనా మ‌ధ్య మ‌రోసారి కార్ప్స్ కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు జ‌రగ‌నున్నాయి. ఈనెల 12న తూర్పు ల‌ఢక్ సెక్టార్ ప్రాంతంలో ఈ చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని ఆర్మీవ‌ర్గాలు తెలిపాయి.

సైనిక మోహరింపుపై ఈ సంద‌ర్భంగా ఇరుదేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న సైనిక ప్ర‌తిష్టంభ‌న‌పై అధికారులు చ‌ర్చించే అకాశం ఉంద‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఆరుసార్లు కార్ప్స్ కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు జ‌రిగాయి. గ‌త జూన్ నెల‌లో ల‌ఢ‌క్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌-చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విష‌యం తెలిసింది. ఈసంద‌ర్భంగా చైనా బ‌ల‌గాలు భార‌త సైనికుల‌పై రాడ్లు, క‌త్తుల‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడిచేశారు.

భారత్ ఊహించని రీతిలో చోటుచేసుకున్న ఈ దాడిలో మన 20 మంది సైనికులు మృతిచెందారు. అప్ప‌టినుంచి భార‌త్, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. భార‌త‌ స‌రిహ‌ద్దుల వెంబ‌డి భారీగా సైన్యాలు, అత్య‌ధునిక ఆయుదాల‌ను చైనా మోహ‌రిస్తూ వ‌స్తున్న‌ది. ఈ ప‌రిస్థితుల‌ను నివారించ‌డానికి ఇరుదేశాల సైనికాధికారులు ప‌లువిడ‌త‌లుగా స‌మావేశ‌మ‌య్యారు. చైనా తమ సైన్యాన్ని వెనుకకు తీసుకోవడంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదు.

Tags :
|
|
|

Advertisement