Advertisement

వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

By: Sankar Tue, 16 June 2020 8:36 PM

వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు



రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాలలో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది

దీంతో ఉత్తర బంగాళఖాతంలో జూన్‌ 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావారణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మంగళవారం నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.


Tags :
|
|

Advertisement