Advertisement

తెలంగాణాలో ఆ తేదీ నుంచి కాలేజీలు ప్రారంభం

By: Sankar Thu, 08 Oct 2020 2:53 PM

తెలంగాణాలో ఆ తేదీ నుంచి కాలేజీలు ప్రారంభం


కరోనా వైరస్‌ విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్‌ ప్రభావం అన్ని వ్యవస్థలపైన పడింది. ముఖ్యంగా కరోనా విద్యాసంస్థల ప్రారంభంపై తీవ్ర ప్రభావమే చూపింది.. ఇక, ఎడ్యుకేషన్ ఇయర్ కూడా కోల్పోయే ప్రమాదం ఉండడంతో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదే సమయంలో ఆన్‌లైన్ తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతి ఇస్తే.. స్కూళ్లకు కూడా పంపించేందుకు కొన్ని తరగతుల విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో ఈ నెల 15 తర్వాత విద్యాసంస్థల ప్రారంభం సాధ్యం కాదని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.

దసరా పండుగ తర్వాత పరిస్థితులను సమీక్షించి పాఠశాలలు ప్రారంభించే విధంగా విధివిధానాలను రూపొందించాలని, వాటి ఆధారంగా సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. అటు యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కాలేజీలు నవంబర్‌ 1 నుంచి యథావిధిగా ప్రారంభం అవుతాయని తెలిపింది.

Tags :
|

Advertisement