Advertisement

  • మహిళా ఎస్ఐ చేసిన పనికి ముగ్దుడు అయి లేచి నిల్చొని సెల్యూట్ చేసిన కలెక్టర్

మహిళా ఎస్ఐ చేసిన పనికి ముగ్దుడు అయి లేచి నిల్చొని సెల్యూట్ చేసిన కలెక్టర్

By: Sankar Tue, 18 Aug 2020 4:47 PM

మహిళా ఎస్ఐ చేసిన పనికి ముగ్దుడు అయి లేచి నిల్చొని సెల్యూట్ చేసిన కలెక్టర్


కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎవరైనా చనిపోతే సొంత వాళ్ళే పట్టించుకోకుండా పడేసి వెళ్లిపోతున్న రోజుల్లో తమిళనాడులోని తిరువనమలై జిల్లాకు చెందిన ఎస్‌ఐ అల్లిరాణి చేసిన పనికి ముగ్దుడు అయిన ఆ జిల్లా కలెక్టర్ ఎస్‌ఐని తన స్థానంలో నిల్చొబెట్టి ఆమెకు సెల్యూట్ చేసి అరుదైన గౌరవం ఇచ్చారు.

ఆమె చేసిన మంచి పనికి ముగ్ధులై ఆయన ఇలా చేశారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళనాడులోని తిరువనమలై జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కలెక్టర్ అవార్డులు ప్రదానం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా ఎస్ఐకి కలెక్టర్ సెల్యూట్ చేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆమె పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్ది రోజుల కిందట ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు. అయితే.. కుటుంబసభ్యులు, బంధువులు ఆ మృతదేహం వద్దకు రావడానికి భయపడి దూరంగా ఉన్నారు. అలాంటి విషాద సమయంలో ఎస్‌ఐ అల్లిరాణి ధైర్యంగా ముందుకొచ్చి ఆ మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించారు.

ఎస్‌ఐ అల్లిరాణికి పతకం, మెమొంటోను అందజేసిన కలెక్టర్.. ఆ తర్వాత ఆమెను తన స్థానంలో నిల్చొబెట్టి తాను డయాస్ మీద నుంచి కిందకు దిగి ఆమెకు సెల్యూట్ చేశారు. సుమారు 20 సెకన్ల పాటు అలాగే సెల్యూట్ చేస్తూ నిల్చున్నారు. అది చూసి అక్కడి వారంతా చప్పట్లతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు

Tags :

Advertisement