Advertisement

  • ఈసారి తొందరగా మొదలైన చలి.. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు..

ఈసారి తొందరగా మొదలైన చలి.. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు..

By: chandrasekar Mon, 09 Nov 2020 3:23 PM

ఈసారి తొందరగా మొదలైన చలి.. కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు..


ఈసారి నవంబరు నెలలోనే తొందరగా చలి మొదలై కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు చేయబడుతున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో చలి విజృంభిస్తున్నది. వారం రోజులుగా ఉష్టోగ్రత క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఆదివారం జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలకు పడిపోయింది. సాయంత్రం కాగానే చలి మొదలవుతున్నది. ఉదయం చలితోపాటు పొగ మంచు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. జిల్లాలో అటవీ, వ్యవసాయ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో నవంబర్‌లోనే వణుకు మొదలైంది. పదిహేను రోజుల క్రితం రాత్రి ఉష్ణోగ్రత నిలకడగా ఉండగా వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఆదివారం జిల్లాలో 14 డిగ్రీల ఉష్ణొగ్రత నమోదైంది. మోమిన్‌పేట్‌, మర్పల్లి, నవాబ్‌పేట్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా దోమ, యాలాలలో 16 డిగ్రీల ఉష్ణొగ్రత నమోదైంది. ఉదయం 8 గంటల వరకు జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని రోడ్లు, పంటపొలాలు పొగమంచుతో కమ్ముకుపోతున్నాయి.

శీతాకాలం దగ్గర పడడంతో సాయంత్రం 4 గంటల నుంచే వాతావరణం చల్లబడుతోంది. ఐదు గంటలు కాగానే రాత్రిలా అనిపిస్తోంది. మరో వారం రోజుల్లో రాత్రి ఉష్ణోత్రలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో తెల్లవారుజామున కురుస్తున్న మంచు, రాత్రివేళలో వీస్తున్న చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ఉన్నితో నేసిన స్వెట్టర్లు, టోపీలు, జర్కిన్‌లు, శాలువాలు, మఫ్లర్లు, చేతిగ్లౌజులు, స్కార్ప్‌లను ధరించడం ప్రా రంభించారు. యువతకు ఆకర్శణీయంగా కన్పించేందుకు, యూత్‌కు తగ్గట్టుగా మార్కెట్‌లో వెచ్చని దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. శీతాకాలం నేస్తాలు రకరకాల డిజైన్లతో ఆకట్టుకోవడంతో వాటిని కొనేందుకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. దీంతో ఉన్నిదుస్తుల అమ్మకాలు కూడా జోరందుకుంటున్నాయి. ఈ సారి వర్షాలు కూడా బాగా పడడంతో బాటు చలి కూడా ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.

Tags :
|

Advertisement