Advertisement

  • నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టిందని సీఎంఐఈ నివేదిక

నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టిందని సీఎంఐఈ నివేదిక

By: chandrasekar Tue, 28 July 2020 9:09 PM

నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టిందని సీఎంఐఈ నివేదిక


దేశంలో కరోనా మహమ్మారి విజృంభ లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాలు తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కరోనాతో ఉద్యోగాల కోతల కాలం సాగుతుండటంతో ఉపాధి రికవరీ రేటు ఇప్పట్లో కోలుకోలేదనే ఆందోళనల నడుమ జులైలో నూతన ఉద్యోగాల డేటా ఆశలు రేకెత్తిస్తోంది.

జులైలో కొత్తగా పలు ఉద్యోగాలు అందుబాటులోకి రావడంతో నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. నగరాల్లో ఉపాథి అవకాశాలూ గణనీయంగా పెరిగాయని ఈ నివేదిక పేర్కొంది. జూన్‌తో పోలిస్తే నికర నియామకాలు తగ్గినా జులైలోనూ కొత్త నియామకాలు మెరుగ్గానే ఉన్నాయని, జులై 19 వారాంతానికి ఉద్యోగిత రేటు 38.4 శాతానికి పెరిగిందని సీఎంఐఈ సీఈఓ మహేష్‌ వ్యాస్‌ తెలిపారు.

జూన్‌, జులైలో ఉపాధి రేటు పెరుగుదల నగర ఉద్యోగార్ధుల్లో ఆశలు పెంచుతోంది. జులై నెల తొలి మూడు వారాల్లో సగటు ఉపాధి రేటు 37.5 శాతం కాగా, జులై 19 వారాంతానికి నగరాల్లో ఉద్యోగిత రేటు ఏకంగా 35.1 శాతంగా నమోదైంది. గత రెండు వారాలుగా నగర ప్రాంతాల్లో నియామకాలు ఊపందుకోవడం ఉద్యోగార్ధులకు మంచి పరిణామం. నిత్యావసర వస్తువులే కాకుండా సేవల రంగంలోనూ నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే త్వరలోనే జాబ్‌ మార్కెట్‌లోనూ భారీ రికవరీ చోటుచేసుకుంటుందని నిపుణులు అంచనా.

Tags :
|
|

Advertisement