Advertisement

సీఎం రావత్ సెల్ఫ్ క్వారంటైన్లోకి

By: chandrasekar Wed, 02 Sept 2020 10:10 PM

సీఎం రావత్ సెల్ఫ్ క్వారంటైన్లోకి


ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్ రావ‌త్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. సీఎం ఓఎస్‌డీకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా సీఎం రావ‌త్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.

ఇవాళ ఉత్త‌రాఖండ్ రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం జ‌ర‌గాల్సి ఉండేది. సీఎం ఓఎస్‌డీకి క‌రోనా సోక‌డం, సీఎం రావ‌త్ స్వీయ నిర్బంధంలోకి వెళ్ల‌డంతో మంత్రివ‌ర్గ స‌మావేశం వాయిదా ప‌డింది.

ఆగ‌స్టు 25 నుంచి మూడు రోజుల పాటు సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. సీఎం స‌ల‌హాదారుల్లో ఒక‌రికి కరోనా నిర్ధార‌ణ కావ‌డంతో.. మూడు రోజుల పాటు సీఎం విధుల‌కు దూరంగా ఉన్నారు. మ‌ళ్లీ ఇప్పుడు సీఎం రావ‌త్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

Tags :
|
|

Advertisement