Advertisement

రేపటి నుంచే ఆరో విడత హరిత హారం

By: Sankar Wed, 24 June 2020 11:55 AM

రేపటి నుంచే ఆరో విడత హరిత హారం



పచ్చని చెట్లు ప్రగతి మెట్లు అని పెద్దలు అంటుంటారు ..మన చుట్టూ ఉన్న ప్రదేశాలు చెట్లతో ఎంత పచ్చగా ఉంటె మనం కానీ మన యొక్క అభివృద్ధి కానీ అంత ఎక్కువగా ఉంటుంది ..అందుకే ఏ ప్రభుత్వం వచ్చిన చెట్ల పెంపకం మీద శ్రద్ధ తీసుకుంటుంది ..అయితే తెలంగాణాలో తెరాస పాలనలో చెట్ల మీద శ్రద్ధ ఇంకొంచెం పెరిగిందనే చెప్పాలి ..తెలంగాణాలో అటవీ శాతాన్ని 33 శాతానికి పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం హరిత హారం..ప్రత్యేక తెలంగాణవచ్చిన తర్వాత కెసిఆర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున హరిత హారం చేపట్టడం జరుగుతుంది ..

ఇక తాజాగా జూన్ 25న ఆరో విడత హరితహారాన్ని ప్రారంభిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ గురువారం నిరాడంబరంగా హరితహారాన్ని ప్రారంభిస్తారు. గతంలో భారీ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పరిమిత సంఖ్యలో మాత్రమే పాల్గొంటారు. మొక్కలు నాటేప్పుడు కూడా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది.

ఆరో విడత హరిత హారంలో భాగంగా రాష్ట్రంలో 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను ఉచితంగా అందిచనున్నారు. గతంలో గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా మొక్కలు నాటగా.. ఈసారి అడవుల్లో ఎక్కువ మొక్కలు నాటే ప్రణాళికలు రూపొందించారు.
హెచ్ఎండీఏ పరిధిలో 5 కోట్ల మొక్కలు.. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. అటవీ శాఖ అధ్వర్యంలో 2.61 కోట్ల మొక్కలు నాటనున్నారు. హరితహారం కోసం రాష్ట్రంలోని 12,500 నర్సరీల్లో మొక్కలు రెడీగా ఉన్నాయి.

Tags :
|
|

Advertisement