Advertisement

  • బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్

బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్

By: chandrasekar Tue, 25 Aug 2020 6:00 PM

బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్


ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బడుగు బలహీనవర్గాలకు అండగా నిలుస్తూ కులవృత్తులను సీఎం కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని ఫిలించాంబర్‌ వద్ద రూ.19.20లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఆదివారం ఎంపీ రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై దానం నాగేందర్‌ స్పందించారు.

స్వామిగౌడ్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, బడుగులకు రేవంత్‌రెడ్డి చేతికర్ర కాదని, చేతులు లేని కర్ర అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సంక్షేమ పథకాలతో గౌడ, యాదవ కులాలతో పాటు మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. రాష్ట్రంలోని అన్ని కులవృత్తులను సీఎం కేసీఆర్‌ ఆదరిస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని చూడలేని వారు కళ్లున్న కబోదులు అన్నారు.

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంలో సుమారు రూ.60కోట్ల మేర నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. జూబ్లీహిల్స్‌ డివిజన్‌లోని అంబేద్కర్‌నగర్‌, గురుబ్రహ్మనగర్‌, దీన్‌దయాళ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఏఈ వెంకటేశ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్ర, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ నాయకుడు పెరుక కిరణ్‌కుమార్‌, బోజిరెడ్డి, నాయకులు ఎల్లయ్య, అశోక్‌, గోపాల్‌ నాయక్‌, రాములు,దీపాదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :
|
|

Advertisement