Advertisement

  • దెబ్బతిన్న ప్రార్ధన మందిరాల స్థానంలో కొత్తవి నిర్మించి ఇస్తాం ..సీఎం కెసిఆర్

దెబ్బతిన్న ప్రార్ధన మందిరాల స్థానంలో కొత్తవి నిర్మించి ఇస్తాం ..సీఎం కెసిఆర్

By: Sankar Fri, 10 July 2020 2:22 PM

దెబ్బతిన్న ప్రార్ధన మందిరాల స్థానంలో కొత్తవి నిర్మించి ఇస్తాం ..సీఎం కెసిఆర్



తెలంగాణ సచివాయం కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో వున్న దేవాలయం, మసీదు కొంత దెబ్బతిన్నాయి. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దాని కన్నా పెద్దగా, విశాలంగా ఆలయంతో పాటు మసీదును నిర్మించి ఇస్తామన్నారు.

ఎత్తైన భవనాలు కూల్చే సందర్భంలో అక్కడే ఉన్న ప్రార్థనా మందిరాలపై శిథిలాలు పడి అవి దెబ్బతినడంపై తాను చాలా బాధపడుతున్నాను అన్నారు కేసీఆర్‌. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం తమ అభిమతం కాదన్నారు.

ఆలయం, మసీదు నిర్వాహకులతో త్వరలోనే సమావేశమవుతానని, వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు... తెలంగాణ రాష్ట్రం సెక్యులర్‌ రాష్ట్రం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

కాగా సెక్రటేరియట్ కూల్చివేతపై హైకోర్టు లో దాఖలైన పిటిషన్ మీద హై కోర్ట్ నేడు విచారణ చేపట్టింది .భవనాల కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికే సచివాలయంలోని సగానికి పైగా భవనాలను కూల్చివేశామని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొందని ఆదేశాలు జారీ చేసింది.

Tags :
|
|
|
|
|

Advertisement