Advertisement

  • కొత్త సెక్రటేరియట్ లో అన్ని సౌకర్యాలు ఉండాలి ..సీఎం కెసిఆర్

కొత్త సెక్రటేరియట్ లో అన్ని సౌకర్యాలు ఉండాలి ..సీఎం కెసిఆర్

By: Sankar Wed, 29 July 2020 10:47 PM

కొత్త సెక్రటేరియట్ లో అన్ని సౌకర్యాలు ఉండాలి ..సీఎం కెసిఆర్



నూతనంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్‌లో సకల సౌకర్యాలుండాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణంపై ముఖ్యమంత్రి బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. వీటిలో పలు మార్పులను సూచించారు. సెక్రటేరియట్ లో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలుండేలా చూడాలని ఆదేశించారు.

మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్స్ కూడా అన్ని సౌకర్యాలతో ఉండాలన్నారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాలు, వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండేలా నిర్మాణం ఉండాలని సీఎం సూచించారు.ఈ సమావేశంలో మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంఓ అధికారులు, తదితరులు పాల్గొనారు.

కాగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణం మీద ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే ..పాత సెక్రటేరియట్ కూల్చివేత మీద అనేక విమర్శలు వచ్చాయి ..ఇపుడున్న కరోనా పరిస్థితుల్లో ఆ సెక్రటేరియట్ కూల్చివేత అవసరమా అని ప్రతిపక్షాలు ప్రశ్నిచాయి ..అయితే హై కోర్ట్ కూల్చివేతకు అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులను మొదలు పెట్టింది

Tags :
|
|
|

Advertisement