Advertisement

  • యాదాద్రి నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కెసిఆర్

యాదాద్రి నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కెసిఆర్

By: Sankar Sun, 08 Nov 2020 09:25 AM

యాదాద్రి నిర్మాణ పనులపై  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కెసిఆర్


భారతదేశంలోని పలు ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాల స్థాయిలో యాదాద్రిని తీర్చిదిద్దుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రారంభం ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పనుల వేగాన్ని పెంచి మరో రెండు మూడు నెలల్లో ప్రారంభించుకునే దిశగా ఆలయ అధికారులు పూనుకోవాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపిన యాదాద్రి ఆలయం, నిర్మాణాలు పూర్తి చేసుకునే సమయానికి మరింతగా ప్రాచుర్యాన్ని పొందుతుందన్నారు. ప్రభుత్వం కూడా యాదాద్రి ప్రాశస్త్యాన్ని భక్తలోకానికి తెలియచెప్పే విధంగా సమాచారాన్ని అందిస్తుందని, చివరి అంకానికి చేరుకున్న నిర్మాణాల్లో ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా వుండాలన్నారు.

ఆలయ పరిసరాలన్నీ ప్రశాంతతతో అలరారేలా ప్రకృతి సుందరీకరణ పనులను తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండడంతో ఈ పుణ్యక్షేత్రానికి ప్రాధాన్యత మరింతగా పెరుగుతుందని, దేశ విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన టూరిస్టులు, భక్తులు యాదాద్రిని దర్శించే అవకాశాలుంటాయన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Tags :
|
|

Advertisement