Advertisement

  • తెలంగాణలో వచ్చే మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు ..సీఎం కెసిఆర్ సమావేశం

తెలంగాణలో వచ్చే మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు ..సీఎం కెసిఆర్ సమావేశం

By: Sankar Fri, 04 Sept 2020 10:10 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు ..సీఎం కెసిఆర్ సమావేశం


తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాల వారీగా సమాచారం తెలుసుకుని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు చేస్తున్నారు.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. రాబోయే మూడు రోజులపాటు కూడా భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, జలవనరుల శాఖ, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వ్యవసాయ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు.

Tags :
|
|

Advertisement