Advertisement

  • కరోనా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది ..సీఎం కెసిఆర్

కరోనా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది ..సీఎం కెసిఆర్

By: Sankar Fri, 17 July 2020 4:29 PM

కరోనా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది ..సీఎం కెసిఆర్


తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన కొత్తలో దాన్ని ఎదుర్కొనే క్రమంలో కేంద్ర ప్రభుత్వమే తొలుత గందరగోళంలో ఉండేదని సీఎం అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం ఉండే 5 వేల పడకలను సిద్ధం చేసినట్లు చెప్పారు. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 10 వేల పడకలు కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాక, 1,500 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని, కావాల్సినన్ని పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు.

కరోనా బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందనక్కర్లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరండి. ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంది. కరోనాతో సహజీవనం చేయక తప్పని పరిస్థితి వచ్చింది. అని కేసీఆర్ అన్నారు.రోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే క్రమంలో జనరల్ బడ్జెట్‌కు అదనంగా రూ.100 కోట్లను సీఎం కేటాయించారు. ఆరోగ్య మంత్రి, సీఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేసేందుకు వీలుగా ఈ నిధులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. కరోనా విషయంలో ప్రతిపక్షాలు అవగాహన లేకుండా చేసే చిల్లర విమర్శలను తాము పట్టించుకోబోమని సీఎం తేల్చి చెప్పారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని.. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ హెచ్చరించారు. ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని పడకలు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే విషయాలను బహిరంగంగా ప్రకటించాలని ఆదేశించారు.

Tags :
|
|

Advertisement