Advertisement

  • రాష్ట్రంలో అర్హుడైన ప్రతి రైతుకు రైతు బంధు అందాలి ..సీఎం కెసిఆర్

రాష్ట్రంలో అర్హుడైన ప్రతి రైతుకు రైతు బంధు అందాలి ..సీఎం కెసిఆర్

By: Sankar Sun, 12 July 2020 3:16 PM

రాష్ట్రంలో అర్హుడైన ప్రతి రైతుకు రైతు బంధు అందాలి ..సీఎం కెసిఆర్

తెలంగాణ సీఎం కెసిఆర్ దాదాపు రెండు వరాల తర్వాత ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు ..ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నా ప్రభుత్వం రైతులకు రైతుబంధు సాయం విడుదల చేసింది. ఇప్పటి వరకు 99.9 శాతం మంది రైతులకు ఈ సాయం అందింది. ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? లేదా అనేది గుర్తించాలి.

ఎవరైనా మిగిలిపోతే అందించే ఏర్పాట్లు చేయాలి. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ లేదు. చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దు. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికింది.’’ అని కేసీఆర్ అన్నారు.ఇక ఈ వానాకాలం పంటలో ప్రభుత్వం సూచించిన విధంగానే రైతులు నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తుండడం శుభ పరిణామమని అన్నారు. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడం లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని సూచించిందని అన్నారు

రైతులు చర్చించుకోవడానికి, అధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. దసరాలోగా ఈ వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపాలి. రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే వారికి రక్షణ వేదికలు అవుతాయి.

Tags :
|
|
|
|

Advertisement