Advertisement

  • ఈ రోజు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ.. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య..

ఈ రోజు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ.. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య..

By: chandrasekar Sat, 28 Nov 2020 11:23 AM

ఈ రోజు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ.. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య..


హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లను చేస్తూ వుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ నేతలు సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సభ జరగనుంది. కోవిడ్ నిబంధనల మధ్య సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ సభ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలకు కేసీఆర్ ఈ సభా వేదికగా సమాధానం ఇస్తారని అంతా ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి పార్టీ శ్రేణులు సభను ఏర్పాటు చేశాయి. గ్రేటర్‌లోని 150 డివిజన్ల నుంచి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు నిర్దేశించిన వేదికలపైకి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది, కార్యకర్తలు 3గంటల వరకే స్టేడియం చేరుకోవాలి. టీఆర్ఎస్ నేతలు ఈ సభలో నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ స్టేడియం లో బహిరంగ సభకు అందరిని అనుమంతించడానికి 14గేట్ల వద్ద పది మంది చొప్పున వాలంటీర్లు ఉంటారు. గేట్ల వద్ద కార్యకర్తలకు, నేతలకు శానిటైజ్ చేసి, మాస్కులు ఇచ్చి సభలోపలికి పంపిస్తారు. విఐపిలు సి గేట్ ద్వారా వచ్చే ఏర్పాట్లు చేశారు. ఇక సభకు వచ్చేవారి వాహనాల్ని మహబూబియా కాలేజ్ వద్ద పార్కింగ్ చేసే సౌకర్యం కల్పించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు డి అండ్ ఈ గేట్ ద్వారా, కార్పొరేటర్లు, మీడియాకు బి గేట్ ద్వారా ఎంట్రీ ఉంటుంది. కేసీఆర్‌ ప్రసంగం వీక్షించేందుకు స్టేడియం లోపల, బయట ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ఈ సభకు ఒక్కో డివిజన్‌ నుంచి దాదపుగా మూడు వేల ఐదువందల మందిని తరలించాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాన వేదిక మీద ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చుంటారని నిర్వాహకులు తెలిపారు. రెండో స్టేజ్ కళాకారుల కోసం, మరో స్టేజి ని అభ్యర్థుల కోసం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలవల్ల హైదరాబాద్ నగరవాసులకి భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

Tags :
|
|

Advertisement