Advertisement

  • దేశ రక్షణ విషయంలో అందరూ ఒక్కతాటిపై నిలబడాలి ..మోడీకి సూచించిన కెసిఆర్

దేశ రక్షణ విషయంలో అందరూ ఒక్కతాటిపై నిలబడాలి ..మోడీకి సూచించిన కెసిఆర్

By: Sankar Wed, 17 June 2020 7:52 PM

దేశ రక్షణ విషయంలో అందరూ ఒక్కతాటిపై నిలబడాలి ..మోడీకి సూచించిన కెసిఆర్



భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో ఆ అంశంపై మాట్లాడారు. కరోనా వైరస్ కట్టడి అంశంపై బుధవారం కొన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ చైనా సరిహద్దు ఘర్షణ అంశాన్ని ప్రస్తావించారు.

దేశ రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీపడవద్దని కేసీఆర్ మోదీకి సూచించారు. ఈ విషయంలో దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు కేంద్రానికి మద్దతుగా ఉంటామని తెలిపారు. చైనా సహా ఏ దేశమైనా భారత సార్వభౌమత్వం విషయంలో వేలు పెడితే ప్రతిఘటించాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు.

దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో అంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు తగవని వ్యాఖ్యానించారు. దేశమంతా ఏకమై ఒకే గళం వినిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇరు దేశాల సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది సైనికులకు నివాళులర్పిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని, సీఎంలు మౌనం పాటించారు.


Tags :
|
|

Advertisement