Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చూసి డీలా పడొద్దు...సీఎం కెసిఆర్

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చూసి డీలా పడొద్దు...సీఎం కెసిఆర్

By: Sankar Fri, 13 Nov 2020 2:33 PM

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చూసి డీలా పడొద్దు...సీఎం కెసిఆర్

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలకు నేడో రేపో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. ఓటరు తుది జాబితా కూడా శుక్రవారం వెలువడుతున్నందున ఎన్నికలకు పార్టీపరంగా పూర్తి సన్నద్ధంగా ఉండటంతో పాటు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’అని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పార్టీ యంత్రాంగానికి పిలుపునిచ్చారు.

మంత్రులు, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కొం దరు ముఖ్యనేతలతో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం భేటీ అయ్యారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి దాదాపు ఆరున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మొదలుకుని రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. వివిధ అంశాలకు సంబంధించి పలుమార్లు మంత్రులు, పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం చూసి అధైర్యపడొద్దు. గాలివాటు గెలుపును చూసి గాభరా చెందాల్సిన అవసరం లేదు. మనకు పటిష్టమైన పార్టీ యం త్రాంగం, బలమైన నేతలు ఉన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్దాం. 2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల ఫలి తాల మాదిరిగానే ఈ దఫా కూడా పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుంది అని అన్నారు...

Tags :
|

Advertisement