Advertisement

ధరణి పోర్టల్ ప్రారంభించిన సీఎం కెసిఆర్

By: Sankar Thu, 29 Oct 2020 7:11 PM

ధరణి పోర్టల్ ప్రారంభించిన సీఎం కెసిఆర్


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు..మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధరణి పోర్టర్‌ అధికారికంగా ప్రారంభించారు..

రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొస్తుంది. దీంతో ఇకపై అన్ని రకాల రిజిస్ట్రేషన్లు అన్‌లైన్‌లోనే జరగనున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రతీ ఇంటి జాగాను కూడా త్వరలోనే కొలుస్తామన్నారు. పోర్టల్‌లో భూమి వివరాలు ఎక్కడ నుంచి అయినా చూసుకోవచ్చన్నారు.

పావుగంటలోనే రిజిస్ట్రేసన్ మ్యాటేషన్ జరుగుతుందన్నారు. పోర్టల్‌లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వస్తాయన్నారు సీఎం. ప్రతీ ఇంచు భూమిని డిజిటిలైజేషన్ చేస్తామన్నారు. భూ సమస్య రైతుకు తలనొప్పిగా మారిందన్నారు. ధరణి పూర్తి పారదర్శకంగా ఉందన్నారు.

భూముల గోల్ మాల్ సంగతే ఉండదన్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదన్నారు. జిల్లాకో టెక్నికల్ టీం ఏర్పాటు చేస్తామన్నారు.ఇకపై రిజిస్ట్రేషన్లకు పైరవీలు అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి. ఎండోమెంట్, వక్ఫ్ భూముల కబ్జాలు కూడా ఉండవన్నారు

Tags :
|
|
|

Advertisement