Advertisement

  • కరాటే క్రీడాకారిణి అంజనకు సాట్స్‌లో ఉద్యోగం కల్పించిన సీఎం కేసీఆర్

కరాటే క్రీడాకారిణి అంజనకు సాట్స్‌లో ఉద్యోగం కల్పించిన సీఎం కేసీఆర్

By: chandrasekar Fri, 09 Oct 2020 12:29 PM

కరాటే క్రీడాకారిణి అంజనకు సాట్స్‌లో ఉద్యోగం కల్పించిన సీఎం కేసీఆర్


కరీంనగర్‌కు చెందిన అంతర్జాతీయ కరాటే క్రీడాకారిణి అంజనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం అందింది. జీవో ఎంఎస్‌ నం.14 ద్వారా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌)లో డాటా ఎంట్రీ ప్రాసెసింగ్‌ ఆఫీసర్‌గా కాంట్రాక్టు పద్ధతిలో నియమించింది.

గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అంజన విధుల్లో చేరింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ కరాటే టోర్నీల్లో పాల్గొన్న అంజన 272 పతకాలు సాధించింది. ఈ క్రమంలో ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా సాట్స్‌లో ఉద్యోగం కల్పించారు.

ప్రతిభకు గుర్తింపుగా ఉద్యోగం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రు లు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌కు అంజన తల్లిదండ్రులు రాణి, భీంరావు, కోచ్‌ శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు. 'రాష్ట్రంలో అన్ని వర్గాలతో పాటు క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ఏండ్ల నా ఉద్యోగ కలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడం జీవితంలో మరిచిపోలేను'.అని అంజన కృతజ్ఞతలు తెలిపింది.

Tags :
|
|
|
|
|

Advertisement