Advertisement

  • వరద బాధితులకు సాయం అందకుండా బీజేపీ అడ్డుపడింది ...ఫైర్ అయిన సీఎం కెసిఆర్

వరద బాధితులకు సాయం అందకుండా బీజేపీ అడ్డుపడింది ...ఫైర్ అయిన సీఎం కెసిఆర్

By: Sankar Wed, 18 Nov 2020 8:54 PM

వరద బాధితులకు సాయం అందకుండా బీజేపీ అడ్డుపడింది ...ఫైర్ అయిన సీఎం కెసిఆర్


బీజేపీపై ఫైరయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. హైదరాబాద్‌లో వరదబాధితులకు సాయం అందకుండా.. కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్నికలను అడ్డం పెట్టుకుని.. సాయం అందకుండా చేసిన పేదల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్‌.

ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడం వల్ల.. వరద సహాయం పంపిణీ నిలిచిపోతుందన్నారు. లేదంటే, వేల మంది పేదలకు సాయం అందేదన్నారు. ఇక కేంద్రంపై సమరానికి సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్. డిసెంబర్‌ 2వ వారంలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటానికి రెడీ అయ్యారు. డిసెంబర్‌ 2వ వారంలో సీఎం కేసీఆర్‌ కాన్‌క్లేవ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే 10 మంది పార్టీ అధ్యక్షులు, ముఖ్య మంత్రులతో కేసీఆర్ చర్చించారు.

బీజేపీ రాష్ట్రానికి కొత్తగా ఒక్క సంక్షేమ పథకం కూడా తీసుకురాలేదన్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తోందని ఆరోపించారాయన. మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై డిసెంబర్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.

Tags :
|
|
|
|

Advertisement