Advertisement

  • పెన్షన్ల విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది...సీఎం కేసీఆర్‌

పెన్షన్ల విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది...సీఎం కేసీఆర్‌

By: Sankar Sun, 01 Nov 2020 3:02 PM

పెన్షన్ల విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది...సీఎం కేసీఆర్‌


తెలంగాణలో 38,64,751 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, అందులో కేంద్ర ప్రభుత్వం కేవలం 6.95 లక్షల మందికే పెన్షన్లు అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శనివారం ఆయన జనగామ జిల్లా కొడకండ్లలో తొలి రైతు వేదికను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. పెన్షన్ల విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

కేంద్రం కేవలం మనిషికి రూ.200 చొప్పున మాత్రమే పింఛన్లు అందిస్తే.. బీజేపీ నేతలు మాత్రం రూ.1600 చొప్పున ఇస్తోందని అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రతి ఒక్కరికి రూ.2,016 చొప్పున పెన్షన్లు అందిస్తుందని గుర్తు చేశారు. పెన్షన్ల విషయంలో తాను చెప్పేది అబద్దమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని బీజేపీ నేతలకు కేసీఆర్‌ సవాల్‌ విసిరారు.

ఇక రైతు వేదిక ఏర్పాటు వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం అన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా రైతులకు ఒక వేదిక లేదని, తెలంగాణాలోనే తొలిసారి రైతుల కోసం భవనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉద్యమ సమయంలో రైతుల బాధలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

Tags :
|

Advertisement