Advertisement

  • మళ్ళీ తెలంగాణ జోలికి రాకుండా దీటైన సమాధానం చెప్పాలి ...ఏపీ ప్రభుత్వంపై సీఎం కెసిఆర్ ఫైర్

మళ్ళీ తెలంగాణ జోలికి రాకుండా దీటైన సమాధానం చెప్పాలి ...ఏపీ ప్రభుత్వంపై సీఎం కెసిఆర్ ఫైర్

By: Sankar Wed, 30 Sept 2020 7:04 PM

మళ్ళీ తెలంగాణ జోలికి రాకుండా దీటైన సమాధానం చెప్పాలి ...ఏపీ ప్రభుత్వంపై సీఎం కెసిఆర్ ఫైర్


తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో ఇవాళ సమీక్ష నిర్వమించారు. వచ్చే నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకొని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను సిఎం ఆదేశించారు.

ఈ సందర్భంగా ఏపీ తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ జలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నదన్నారు. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలన్నారు సీఎం. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలన్నారు.

అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ తీరును, ఏడు సంవత్సరాల అలసత్వాన్ని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలన్నారు కేసీఆర్. కాగా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల నేపథ్యంలో అపెక్స్ కాపునిక్ల భేటీ నిర్వహణ ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే..

Tags :
|
|

Advertisement