Advertisement

  • ప్రైవేట్ ఆసుపత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కెసిఆర్

ప్రైవేట్ ఆసుపత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కెసిఆర్

By: Sankar Wed, 09 Sept 2020 4:33 PM

ప్రైవేట్ ఆసుపత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కెసిఆర్


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. సభలో కరోనా వైరస్, వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు తదితర విషయాల గురించి వాడివేడి చర్చ జరుగుతున్నది. కరోనా వైరస్ ట్రీట్మెంట్ విషయం గురించి కూడా సభలో చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పాటుగా కరోనాకు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చికిత్స అందిస్తున్నాయి.

కరోనా ట్రీట్మెంట్ విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్సకు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై సీఎం కేసీఆర్ సభలో స్పందించారు. దందాపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.

కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా ట్రీట్మెంట్ పేరిట డబ్బు సంపాదిస్తున్నాయని అన్నారు. ఏ ఆసుపత్రి అయినా ఉపేక్షించేది లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల దందా విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నామో ప్రతిపక్షాలకు వివరిస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు..ఇక మరణాలు దాచేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు. మరణాలను ఎవరైనా దాచేస్తారా? కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియదా? మరణాలు దాచేస్తే దాగేవేనా? కరోనా ప్రపంచం, దేశానికి వచ్చిన విపత్తు. కేవలం తెలంగాణలో మాత్రమే కరోనా రాలేదు.

Tags :
|
|
|
|

Advertisement