Advertisement

  • కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తాము ..సీఎం కెసిఆర్

కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తాము ..సీఎం కెసిఆర్

By: Sankar Wed, 09 Sept 2020 3:41 PM

కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తాము ..సీఎం కెసిఆర్


కరోనా విషయంలో ప్రపంచం మొత్తం గందరగోళానికి గురౌతోందని అన్నారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది రేయింబవళ్లు కష్టపడుతున్నారని సీఎం తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో తెలియజేశారు. ప్రజలను కాపాడేందుకు మరో రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేశారు.

ప్రజలు కోరితేనే హోం ఐసోలేషన్‌కు అనుమతి ఇచ్చామన్నారు. ఢిల్లీ సహా ఇతర రాష్ర్టాల్లో సంప్రందించిన తర్వాతే హోం ఐసోలేషన్‌కు అనుమతి ఇచ్చామన్నారు. మరణాలు దాచేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారు. మరణాలను ఎవరైనా దాచేస్తారా? కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియదా? మరణాలు దాచేస్తే దాగేవేనా? కరోనా ప్రపంచం, దేశానికి వచ్చిన విపత్తు. కేవలం తెలంగాణలో మాత్రమే కరోనా రాలేదు.

రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య ఎక్కువ ఉందన్నారు. కరోనా మరణాల సంఖ్య జాతీయ స్థాయిలో కంటే తక్కువగా ఉందని తెలిపారు. డబ్బుల విషయంలో గతి లేని స్థితిలో రాష్ట్రం లేదు. అన్‌లాక్‌ ప్రారంభమైన తర్వాత రికవరీలో ముందంజలో ఉన్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement