Advertisement

కరోన టీకాకు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన...

By: chandrasekar Sat, 05 Dec 2020 4:42 PM

కరోన టీకాకు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన...


కరోనా నియంత్రణ, ప్రభుత్వ ఆరోగ్య విధానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సమాధానమిచ్చారు. కేంద్రం మొదటి విడతలో రాష్ట్రానికి కోటిమందికి సరిపడా టీకాలను సరఫరా చేయనుందని టీకా నిల్వ, సరఫరాకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించింది అని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం టీకా వచ్చేందుకు 3, 4 నెలలు సమయం పడుతుందన్నారు. టీకాలు వేయడంలో ఆశ వర్కర్లకు శిక్షణ ఇస్తామని.. మొదటివిడతలో 3.60 లక్షల వైద్యసిబ్బంది, ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది 7 లక్షలు, 50 ఏళ్లు పైబడిన 90 లక్షల మందికి టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. టీకా నిల్వ కోసం ఫ్రిజ్‌లు, ఫ్రీజర్లు సిద్ధం చేశామన్నారు.. మిగిలిన ఏర్పాట్లు చేశామన్నారు. కరోనాపై గత 9 నెలలుగా యుద్ధం చేస్తున్నామన్నారు సీఎం జగన్. మరికొన్ని నెలలు జాగ్రత్తగా ఉండాలని ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిటన్‌ లాక్‌డౌన్‌లో ఉన్నాయని టీకా అందరికీ సరఫరా చేయడం ఇప్పుడు కుదరదు అన్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌ల్లో కేసులు పెరుగుతున్నాయని.. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ల్లో రాత్రిపూట కర్ఫ్యూ పెడుతున్నారని చేశారు.

పెద్ద ఆసుపత్రులు తక్కువే ఉన్నా కరోనా నియంత్రణలో విజయం సాధించామన్నారు. కరోనాపై ప్రభుత్వం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రజల్లో భయాందోళనలు కలిగించారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈనెల 10నుంచి ఆరోగ్యమిత్రలను నియమిస్తున్నామన్నారు. ప్రతీ గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌లు తీసుకొస్తున్నామని.. ఏఎన్‌ఎం ఆశ వర్కర్‌ అక్కడే ఉంటారన్నారు. రాష్ట్రంలో కరోనా వచ్చేసరికి ఒక్క వైరాలజీ ల్యాబ్ దేన్నారు మంత్రి. శాంపిల్స్‌ను పుణె పంపాల్సి వచ్చేదని ఇప్పుడు రాష్ట్రంలోనే 150 ల్యాబ్‌‌లు ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే రూ.లక్షల్లో ఖర్చవుతున్నాయనే విమర్శలున్నాయని ఏపీలో ఇలాంటి ఫిర్యాదులు రాలేదు అన్నారు. రాష్ట్రంలో 243 కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేశామన్నారు.

Tags :
|

Advertisement