Advertisement

  • ఉచితంగా ఇసుక తీసుకెళ్లండి ..కొన్ని పనులకు ఏపీ సర్కార్ అనుమతి

ఉచితంగా ఇసుక తీసుకెళ్లండి ..కొన్ని పనులకు ఏపీ సర్కార్ అనుమతి

By: Sankar Fri, 26 June 2020 10:57 AM

ఉచితంగా ఇసుక తీసుకెళ్లండి ..కొన్ని పనులకు ఏపీ సర్కార్ అనుమతి



ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నది నుంచి ఇసుకను తరలించే విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు..ఎడ్లబళ్లపై సొంత అవసరాలకు ఇసుక ఉచితంగా తీసుకెళ్లొచ్చని చెప్పిన ప్రభుత్వం.. ట్రాక్టర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..సొంత అవసరాలు, బలహీనవర్గాల గృహ నిర్మాణం, సహాయ పునరావాస ప్యాకేజీలకు మాత్రమే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా నదుల పరిసర గ్రామాల ప్రజల సొంత అవసరాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు. ఇందుకు పంచాయతీ కార్యదర్శి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న షరతు ఉంటుంది. ఎడ్ల బండ్ల ద్వారా తీసుకెళ్లి వేరే చోట నిల్వ చేసి, విక్రయిస్తే చర్యలు తీసుకుంటారు. సొంత అవసరాలకే ఎడ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పుడు ట్రాక్టర్లకు అనుమతి ఇచ్చారు.

సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లానుకుంటే గ్రామ, వార్డు సచివాలయాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి కోరిన వారి వివరాలు నమోదు చేసుకుని, ఎలాంటి ఫీజు లేకుండా సచివాలయాలు అనుమతి పత్రం ఇస్తాయి. బలహీన వర్గాల గృహ నిర్మాణం, సహాయ, పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన పనులకు ఉచితంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లేందుకు కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. అలాగే కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించిన మరో అధికారి అయినా అనుమతి ఇవ్వొచ్చు.

Tags :
|
|

Advertisement