Advertisement

  • సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గని సీఎం జగన్...‘జగనన్న చేదోడు’ పథకం కింద అకౌంట్ల‌లో రూ.10వేలు జమ

సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గని సీఎం జగన్...‘జగనన్న చేదోడు’ పథకం కింద అకౌంట్ల‌లో రూ.10వేలు జమ

By: chandrasekar Wed, 11 Nov 2020 8:14 PM

సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గని సీఎం జగన్...‘జగనన్న చేదోడు’ పథకం కింద  అకౌంట్ల‌లో రూ.10వేలు జమ


సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్దిదారుడిని వదిలకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందిస్తున్నారు. తొలుత ఎవరికైనా అన్యాయం జరిగితే, మరోసారి అర్హతలను పరిశీలించి న్యాయం చేస్తున్నారు.

తాజాగా మంగళవారం ‘జగనన్న చేదోడు’ పథకం కింద మరో 51,390 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ చేసింది. ఈ పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ట్రాన్స్‌ఫర్ చేశారు.

బీసీ శాఖ మంత్రిగా జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించడానికి అవకాశం రావటం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అర్హులైన అబ్దిదారులకు అన్ని పథకాలు తప్పకుండా అందజేస్తామన్నారు.

జగనన్న చేదోడు పథకం ద్వారా మొదటి విడతలో అర్హత ఉన్న రజకులు, టైలర్లు, నాయీబ్రాహ్మణులకు 2,47,040 మంది లబ్ధి పొందారని పేర్కొన్నారు. మంగళవారం 51, 390 మంది లబ్ది చేకూరిందని అన్నారు. ఈ పథకంలో ఎటువంటి సిఫార్సులు లేకుండా కేవలం అర్హులను వెతికి పట్టుకుని మరి వారికి లబ్ది చేకూర్చుమని అన్నారు.

Tags :

Advertisement