Advertisement

  • సివిల్స్‌ అధికారి వినూత్న ఆలోచన...ఈకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్‌ కార్డుకు శ్రీకారం...

సివిల్స్‌ అధికారి వినూత్న ఆలోచన...ఈకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్‌ కార్డుకు శ్రీకారం...

By: chandrasekar Mon, 23 Nov 2020 7:09 PM

సివిల్స్‌ అధికారి వినూత్న ఆలోచన...ఈకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్‌ కార్డుకు శ్రీకారం...


ఓ యువ ఐఆర్‌టీఎస్‌(సివిల్స్‌) అధికారి..జీవితంలో మధురఘట్టాన్ని ఆరంభించే క్రమంలో వినూత్న ఆలోచనతో పర్యావరణ పరిరక్షణకు ముందడుగేశారు. కూరగాయలు, పూల విత్తనాలతో పెండ్లి పత్రికను తయారు చేయించి వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు.

ఈ వెడ్డింగ్‌ కార్డును నీళ్లలో నానబెట్టి మట్టిలో వేస్తే అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఇండియన్‌ రైల్వేస్‌ ట్రాఫిక్‌ సర్వీసు అధికారి శశికాంత్‌.. విత్తనాలతో మిళితమైన వివాహ ఆహ్వాన పత్రికను ఆగ్రాలోని ఓ స్టార్టప్‌ సంస్థ ద్వారా తయారు చేయించారు.

ఈ కార్డుల్లో బెండ, టమాట, పచ్చిమిర్చితోపాటు చామంతి, బంతి, లిల్లి విత్తనాలను ఉంచారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ను కలిసిన శశికాంత్‌ తన పెండ్లికి రావాలని ఈకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్‌ కార్డును అందజేశారు.

ఈ కార్డు ప్రత్యేకతను తెలుసుకున్న సజ్జనార్‌.. శశికాంత్‌ను అభినందించారు. చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే ఇష్టమనీ, తనవంతుగా పర్యవరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్‌ కార్డుకు శ్రీకారం చుట్టానని శశికాంత్‌ చెప్పారు.

Tags :
|

Advertisement