Advertisement

  • హైదరాబాద్ ప్రజలకు శుభవార్త ..నేటి నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త ..నేటి నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

By: Sankar Fri, 25 Sept 2020 07:34 AM

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త ..నేటి నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు


కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా బంద్ అయిన హైదరాబాద్ సిటీ బస్సులు నేటి నుంచి మళ్ళీ రోడ్డెక్కనున్నాయి..దీనితో చిరు వ్యాపారులు , మధ్యతరగతి వారి రవాణా కష్టాలు తీరనున్నాయి..కరోనా వచ్చిన తర్వాత లాక్ డౌన్ విధించడంతో బస్సులు బంద్ అయ్యాయి..

ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసిన కూడా బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..మెట్రో ప్రారంభం అయినప్పటికీ మాములు ప్రజలు మెట్రో చార్జిలను భరించడం కష్టంతో కూడుకున్న పని..అందుకే సిటీ బస్సులు ప్రారంభించాలని చాల కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు..

అయితే మొదట సిటీలోని 25 శాతం బస్సులనే నడపాలని అధికారులు నిర్ణయించారు. గతంలో గ్రేటర్ పరిధిలో మొత్తం 2800 బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి డిపో నుండి కేవలం 35 బస్సులను నడపనున్నారు. నడిచే 25శాతం బస్సుల్లో కోవిడ్ నిబంధనలు అమలు చేసేలా అధికారులు నిర్ణయం తిఆకున్నారు. ఇక సిటీ బస్సులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక కు కూడా బస్సులను పునరుద్ధరిస్తున్నారు.

ఇక హైదరాబాద్ లో బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభించడం వల్ల ఎంతో మంది ఉద్యోగులకు భారం తగ్గనుంది. కరోనా విజృంభన నేపథ్యంలో సిటీ బస్సులను నిలిపివేయడంతో ఉద్యోగులు క్యాబ్ లలో, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదురుకున్నారు.

Tags :
|
|

Advertisement