Advertisement

  • సిప్లా సిప్లెంజా మరో కరోనా మందును అందుబాటులోకి తేనుంది

సిప్లా సిప్లెంజా మరో కరోనా మందును అందుబాటులోకి తేనుంది

By: chandrasekar Mon, 27 July 2020 7:44 PM

సిప్లా సిప్లెంజా మరో కరోనా మందును అందుబాటులోకి తేనుంది


తాజాగా సిప్లా సిప్లెంజా మరో కరోనా మందును ప్రజలకు అందుబాటులోకి తేబోతోంది. కరోనా వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్ రావాలంటే ఎప్పటికి వస్తుందో, ఎప్పటికి ప్రజలందరికీ చేరుతుందో అంచనాకి అందట్లేదు. ఈలోగానే కరోనా అంతుచూసేందుకు ఆల్రెడీ ఉన్న మందులనే కొత్త బ్రాండ్ నేమ్‌తో రిలీజ్ చేస్తున్నాయి కంపెనీలు. ఇప్పటికే హెటిరో రెమ్‌డెసివిర్‌ను కోవిఫర్ పేరుతో రిలీజ్ చేయగా తాజాగా సిప్లా సిప్లెంజా మందును ప్రజలకు అందుబాటులోకి తేబోతోంది.

ఈ మందును ఫవిపిరవిర్ API ద్వారా హైదరాబాద్‌కి చెందిన అవ్ర ల్యాబొరేటరీస్ తయారుచేస్తోంది. ఇందుకు కేంద్రం ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) అనుమతి ఇచ్చింది. ఫలితంగా సిప్లెంజా కరోనాతో బాధపడేవారికి నివారణ మందుగా ఉపయోగపడనుందని సిప్లా కంపెనీ తెలిపింది. కోవిఫర్ మందు బాటిల్ రూ.5400 ఉంది. అవ్ర ల్యాబొరేటరీస్ తాము తక్కువ ఖర్చుతోనే మందును తయారుచేస్తున్నామని చెబుతోంది. మార్కెట్‌లో డిమాండ్‌కి తగ్గట్లుగా తయారుచేస్తామని వివరించింది. సిప్లాతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అవ్ర ఛైర్మన్ డాక్టర్ ఏ వీ రామారావు తెలిపారు.

సిప్లా డాక్టర్ యూసుఫ్ హెమీడగైన్‌తో తనకు 50 ఏళ్ల స్నేహానుబంధం ఉందన్న ఆయన యాంటీ కాన్సర్, యాంటీ HIV సహా చాలా మందుల తయారీలో కలిసి పనిచేసినట్లు తెలిపారు. కరోనా అంతు చూసేందుకు ఇప్పుడు మరోసారి కలిసి పనిచేస్తున్నామన్నారు. కరోనాకి వ్యాక్సిన్ డిసెంబర్ కల్లా అందుబాటులోకి వచ్చేలా ఉన్నా సంపన్న దేశాలే దాన్ని ముందుగా దక్కించుకునే ఛాన్స్ ఉంది. అందువల్ల ఇండియా లాంటి దేశాలకు వ్యాక్సిన్ రావడానికి టైమ్ పట్టొచ్చు. ఇండియాలో వ్యాక్సిన్ వచ్చినా అది పేదలకు చేరడానికి మరింత టైమ్ పట్టొచ్చు. ఆలోగా దేశంలో కరోనా కేసులు చాలా ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో డెక్సామెథసోన్, రెమ్‌డెసివిర్, ఫవిరవిర్ వంటి మందులతో తయారుచేస్తున్న బ్రాండింగ్ మందులు కరోనా మరణాల్ని ఆపడంలో బాగానే పనిచేస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

Tags :
|
|

Advertisement