Advertisement

  • శ్రీశైలం ప్రమాదంలో ప్రాథమిక సాక్ష్యాలు సేకరిస్తున్న సిఐడి

శ్రీశైలం ప్రమాదంలో ప్రాథమిక సాక్ష్యాలు సేకరిస్తున్న సిఐడి

By: Sankar Sun, 23 Aug 2020 11:41 AM

శ్రీశైలం ప్రమాదంలో ప్రాథమిక సాక్ష్యాలు సేకరిస్తున్న సిఐడి


శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్న ప్రాధమిక అంచనాకు వచ్చారు. అయితే ఈ సంఘటనపై సిఐడి దర్యాప్తు బృందం షార్ట్ సర్క్యూట్ కి గల కారణాలను విశ్లేషించనుంది.

ఈ ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాధమిక సాక్ష్యాలను దర్యాప్తు బృందం సేకరించారు. కాలి పోయిన వైర్ లతో పాటు పవర్ సప్లై కు ఉపయోగించిన వైర్లు, కాలిన పదార్థాలను ఫోరెన్సిక్ బృందం సీజ్ చేశారు. పవర్ జనరేషన్ , సప్లై ఎలాజరిగిందో టెక్నికల్ బృందాలు వీడియో గ్రఫీ చేసింది.

అసలు ఈ ప్రమాదంలో పవర్ సప్లై ఎలా జరిగిందో అనే వివరాలను దర్యాప్తు బృందం రాబట్టింది. సిఐడి దర్యాప్తు బృందం అక్కడి అధికారుల స్టేట్మెంట్ లను సైతం రికార్డ్ చేసింది.మొదట ఫైర్ యాక్సిడెంట్ ఆయన చోట ఫ్లోర్ పగిలి ఉన్న ప్లేస్ లో ఉన్న పదార్థాలను సేకరించింది. సీఐడీ టెక్నికల్ బృందం అక్కడ కాలిన పదార్థాలలో వాటర్ ఉందా లేదా అన్నది విశ్లేషించ నున్శారు.

గతంలో జరిగిన ప్రమాదాలతో ఈ ప్రమాదాన్ని సరిపోల్చలేమని సిఐడి అధికారులు చెబుతున్నారు. మరికొన్ని సాక్ష్యాల కోసం సీఐడీ అధికారుల విచారణ కొనసాగుతందన్నారు. సీఐడీ అధికారుల విచారణలో మానవ తప్పిదం ఉందా లేదా అనేది తేల్చనున్నారు అధికారులు. సీఐడీ ఛీఫ్ గోవింద్ సింగ్ , డిఐజి సుమతి నేతృత్వం లో శ్రీశైలం ప్రమాదంపై విచారణ కొనసాగుతున్నది.

Tags :
|
|

Advertisement