Advertisement

లేడీ కానిస్టేబుల్‌ ఫై సీఐ వేధింపులు

By: chandrasekar Mon, 20 July 2020 6:13 PM

లేడీ కానిస్టేబుల్‌ ఫై సీఐ వేధింపులు


డిండోరి జిల్లా షాపురా పోలీస్ స్టేషన్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న హేమంత్ బర్వే లేడీ కానిస్టేబుల్‌పై మనసు పారేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ కొద్దికాలంగా ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు.

అందుకు ఆమె అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వేధింపులకు గురిచేసేవాడు. సీఐ వేధింపులు భరించలేకపోయిన కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఎంత ఒత్తిడి చేసినా ఆమె ససేమిరా ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్నాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదన్న కసితో క్వార్టర్స్‌లో ఒంటరిగా ఉంటున్న కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. రాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశాడు. లేడీ కానిస్టేబుల్‌‌‌ని కొట్టి పెళ్లికి ఒప్పుకోవాలని బెదిరించాడు.

ఇన్‌స్పెక్టర్ వేధింపులతో భయపడిపోయిన కానిస్టేబుల్ ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఇన్‌స్పెక్టర్‌ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Tags :
|
|

Advertisement