Advertisement

  • లండన్ ప్రజలకు బ్యాడ్ న్యూస్ ...కరోనా కారణంగా క్రిస్మస్ వేడుకలు రద్దు

లండన్ ప్రజలకు బ్యాడ్ న్యూస్ ...కరోనా కారణంగా క్రిస్మస్ వేడుకలు రద్దు

By: Sankar Sun, 20 Dec 2020 12:43 PM

లండన్ ప్రజలకు బ్యాడ్ న్యూస్ ...కరోనా కారణంగా క్రిస్మస్ వేడుకలు రద్దు


కరోనా వైరస్‌ విజృంభిస్తున్ననేపథ్యంలో ఇంగ్లాండ్ రాజధాని లండన్‌తో సహా పశ్చిమ, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో క్రిస్మస్‌ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు.

ఆ ఆంక్షలు ఈరోజు (ఆదివారం) ఉదయం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా, దేశ ప్రజల రక్షణ తన బాధ్యత అనీ, ప్రజల భావోద్వేగాలు తనకు తెలుసు కానీ భారమైన హృదయంతో ఆంక్షలు విధించాల్సి వస్తున్నదన్నారు. శతాబ్దాలుగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఇంగ్లాండ్‌ ప్రజలు.

కరోనా కారణంగా ప్రధానమంత్రి బోరిక్ క్రిస్మస్‌ వేడుకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. బంధు మిత్రులతో కలిసి క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకోవాలని లక్షలాది మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతవరకు టైర్-3 ఆంక్షలు అమలువుతున్న లండన్ నగరం మళ్లీ లాక్ డౌన్‌ను పోలిన టైర్ 4 నిబంధనల్లోకి వెళ్లిపోయింది.

Tags :
|

Advertisement